డబుల్బెడ్రూం ఇండ్ల పథకంలో నంబర్‌వన్‌గా బాన్సువాడ
పేదల ఆత్మగౌరవం కాపాడేందుకు రెండు పడకల ఇండ్లు
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి
సభాపతి స్వగ్రామం పోచారంలో నూతనగృహ ప్రవేశాలు
బాన్సువాడలో 100పడకల మాతాశిశు దవాఖాన ప్రారంభం
100 అంగన్వాడీ భవనాలకు ఒకేచోట శంకుస్థాపన
తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతాశిశు దవాఖానను ఏర్పాటుచేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో రూ.17.8కోట్లతో నిర్మించిన మాతాశిశు వైద్యశాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. బాన్సువాడతోపాటు మరో నాలుగు నియోజకవర్గాల ప్రజలకు దవాఖాన అందుబాటులో ఉంటుందన్నారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. నియోజకవర్గానికి మంజూరైన 100 అంగన్వాడీ భవనాల శిలాఫలకాలను స్పీకర్ అక్కడే ఆవిష్కరించారు. అంతముకుందు స్వగ్రామం పోచారంలో డబుల్ బెడ్రూం ఇండ్లను, డ్వాక్రా భవనాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ సహకారంతో డబుల్ ఇండ్ల నిర్మాణంలో బాన్సువాడ రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు.
బాన్సువాడ, సెప్టెంబర్ 3: తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖానను నిర్మించామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభతో కలిసి బాన్సువాడలో రూ.17కోట్ల80లక్షలతో నిర్మించిన వంద పడకల మాతాశిశు దవాఖానను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. బాన్సువాడలో ప్రారంభమైన ఈ దవాఖానతో బాన్సువాడతో పాటు మరో నాలుగు నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందిస్తుందని తెలిపారు. తల్లీబిడ్డలకు కావాల్సిన అన్ని రకాల వైద్యసేవలు అందుతాయని, రక్తం లేక గర్భిణులు, బాలింతలు మరణించే పరిస్థితులు ఉండవన్నారు. రక్తనిధి కేంద్రం, డయాలసిస్ కేంద్రం, ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నాయని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాల బాన్సువాడకు మంజూరయ్యిందని చెప్పారు. మూడు నెలల గర్భిణి పేరును అంగన్వాడీలో నమోదు చేసుకొని వారికి పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. బాన్సువాడలో ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 1650 ప్రసవాలు జరుగగా.. వీటిలో 64శాతం సుఖ ప్రసవాలే అని తెలిపారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని చెప్పారు. నర్సులు రోగులకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. సోమేశ్వర్‌లో రూ.మూడు కోట్లతో మిల్క్ చిల్లింగ్ సెంటర్‌ను నిర్మించామని, స్త్రీనిధి ద్వారా గేదెల కొనుగోలు కోసం రుణాలు ఇప్పిస్తామని, అవసరమున్న వారు స్థానిక సర్పంచుల వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలని తెలిపారు.
అనంతరం జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ మాట్లాడుతూ.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతోనే తనకు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్న ఘనత స్పీకర్‌కే దక్కుతుందన్నారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లోని మెరుగైన సేవలు గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అందేలా అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది చూడాలన్నారు. కామారెడ్డికి నూతన కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించిన రోజే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ అజయ్‌కుమార్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ సరస్వతి, సీడీపీవో అనురాధ, ఆర్డీవో రాజాగౌడ్, దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ప్రసాద్, నర్సింగ్ కాలేజీ సూపరింటెండెంట్ క్రిష్ణవేణి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ, ఏఎంసీ, మున్సిపల్ చైర్మన్లు పాత బాలకృష్ణ, జంగం గంగాధర్, నాయకులు వెంకట్రాంరెడ్డి, వినయ్, ఎజాస్, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ భవన నిర్మాణ పనుల శిలాఫలకాల ఆవిష్కరణ
వంద పడకల మాతాశిశు దవాఖాన ప్రారంభోత్సవంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో వంద అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ఆయా గ్రామాలు,మండల ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలతో కలిసి ఒకే చోట వంద శిలాఫలకాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.