బీబీపేట (దోమకొండ), ఏప్రిల్ 22: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Gampa Govardhan) అన్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరుగనున్న బహిరంగ సభకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి 3 వేల మందికిపైగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి దోమకొండ మండల బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వ్యామోహంతో ఎన్నో హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ఎన్నికల సమయంలో పార్టీనివీడి మోసంచేసిన నాయకులను ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మెన్ పరికి ప్రేమ్ కుమార్, ముత్యంపేట సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్, బీబీపేట సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, దోమకొండ మండల పార్టీ అధ్యక్షులు గండ్ర మధుసూదన్ రావు, మాజీ ఎంపీపీలు కానుగంటి శారద నాగరాజు, పసులాది బాలమణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్, పాలకుర్తి శేఖర్, బి. శ్రీనివాస్, కె. శీను, కుంచాల సత్యం, పోచయ్య, నాగరాజు రెడ్డి, దోమకొండ సొసైటీ వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు లక్ష్మారెడ్డి, రమేష్, మాజీ సర్పంచ్ బాగా రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బాపురెడ్డి, రాజిరెడ్డి, దేవునిపల్లి శ్రీనివాస్, దుర్గయ్య, యూత్ నాయకులు మహేష్ యాదవ్, నక్క రవి, గణేష్, విజయ్, దోమకొండ, బీబీపేట్ మండలాల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.