బాన్సువాడ, మార్చి 11 : కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టారు.
అక్రమంగా ఇసుక తరలించిన వారిపై నిజాంసాగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలంలోని హెఙ్గుల్, కధఘావ్ గ్రామాల నుంచి రాత్రి వేళలో అక్రమంగా ఇసుక తరలింపు సాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.