సదాశివనగర్ : కామారెడ్డి (Kamareddy) జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం లో గురువారం రాత్రి వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య ( Suicide ) చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం .. బాయికాడి సుశీల (65 ) అనే వృద్ధురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.