కామారెడ్డి : బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండను ఖండిస్తూ.. మతోన్మాద జీహాదీ గుండాలకు వ్యతిరేకంగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రం నిజాంసాగర్ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మతోన్మాద జిహాది దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు ఆధారపు నిత్యానందం మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులకు రక్షణ లేదన్నారు. బంగ్లాదేశ్ లో ఉన్న తీవ్రవాదులు హిందువులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సామల గంగారెడ్డి, గోపాలకృష్ణ బొడ్డు శంకర్,జిల్లా కార్యదర్శి బోల్లి రాజు ,దరి, శ్రీకాంత్ రావు, పాపారావు ,కామారెడ్డి నగర అధ్యక్షులు పట్నం రమేష్ కార్యదర్శి అరవింద్ బజరంగ్దళ్ జిల్లా సంయోజకు అశోక్ ,సాయికుమార్, ఎంజి వేణుగోపాల్, పుల్లూరు సతీష్ చింతల రమేష్ భాజాప జిల్లా కార్యదర్శి రవీందర్ రావు, విపుల్, ముప్పారపు ఆనంద్ పాల్గొన్నారు.