ఎడపల్లి (శక్కర్‌నగర్), ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించే అంగన్వాడీ కేంద్రాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనసాగించాలని ఐసీడీఎస్ ఇన్చార్జి సీడీపీవో వినోద అన్నారు. ఎడపల్లిలోని ఎంపీడీవో కార్యాలయం సమావేశ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమావేశంలో ఆమె పలు సూచనలు చేశారు. గ్రామాల్లో 3 ఏండ్లు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా చూడాలన్నారు. అదే విధంగా గర్భిణులకు, పిల్లలకు అందించే పౌష్టికాహారం, గుడ్లు అంగన్వాడీ కేంద్రాల నుంచే అందించాలని అన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి సీడీపీవో వినోద, మండలంలోని పలు గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
అంగన్వాడీ టీచర్లతో సమీక్షా సమావేశం
వేల్పూర్, ఆగస్టు 30: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయలంలో అంగన్వాడీ టీచర్లతో సూపర్వైజర్ నీరజ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. స్టెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీ సెం టర్లను ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక నుంచి అంగన్వాడీ సెంటర్లలోనే పౌష్టికాహారం అందించాలన్నారు. సెంటర్లకు పిల్లలు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ టీచ ర్లు పాల్గొన్నారు.