జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ప్రజలు
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
పిట్లం/ ఆర్మూర్/ నందిపేట/మాక్లూర్/ నవీపేట/కోటగిరి/బోధన్, నవంబర్ 29: ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్షకు నవంబర్ 29 తేదీ నాటికి 12 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం దీక్షాదివస్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. 2009 నవంబర్29న సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమగతిని మార్చేసిందని ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామశాఖ అధ్యక్షుడు రవిచంద్ర స్థానిక నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ నాయకులు కోటపాటి నర్సింహనాయుడు, పండిత్ ప్రేమ్, ఖాందేశ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంతోపాటు డొంకేశ్వ ర్, వెల్మల్ తదితర గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వెల్మల్ సర్పంచ్ సాయమ్మ, మానిటరింగ్ కమిటీ సభ్యుడు కోమన్‌పల్లి రాజన్న పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయగా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, సర్పం చ్ మల్లారెడ్డి పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మువ్వ నాగేశ్వర్రావు, దొంత ప్రవీణ్‌కుమార్ అధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌పటేల్, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్ పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎం.ఎ.రజాక్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్‌ను పురస్కరించుకుని అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు భవానీపేట్ శ్రీనివాస్, వినోద్ నాయక్, సంధాని, ఇస్తారి నిరాహారదీక్ష చేపట్టారు. వారికి మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతా దేశాయ్, ఏఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్ తదితరులు పండ్ల రసం తాగించి దీక్షను విరమింపజేశారు. సీనియర్ న్యాయవాది, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జి.శ్యామ్‌రావు పాల్గొన్నారు.