కామారెడ్డి, నవంబర్ 23: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసేందుకు మంగళవారం నిజామాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి పట్టణ సమీపంలోని టేక్రియాల్ బైపాస్ వద్ద నాయకులు పటాకులు కాల్చడంతో పాటు పుష్పగుచ్ఛం అందజేశారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న నేపథ్యంలో ముందస్తు అభినందనలు తెలిపారు. రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, నాగిరెడ్డిపేట, సదాశివనగర్ జడ్పీటీసీ సభ్యులు మనోహర్‌రెడ్డి, నర్సింహులు, సదాశివనగర్ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు అల్తాఫ్ హుస్సేన్, సర్పంచ్ బద్దం శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూర్ ఎల్లారెడ్డి విండో చైర్మన్ సదాశివరెడ్డి, నాయకులు సత్యంరావు, పడిగెల రాజేశ్వర్‌రావు, శివాజీరావు, మర్కింటి భూమయ్య, సీతాయిపల్లి శ్రీనివాస్, సంకరి రాజలింగం, గోగు కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
అంతకుముందు కవితను టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజీబొద్దీన్, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ఆమెతో కలిసి నిజామాబాద్‌కు తరలివెళ్లారు.
శుభాకాంక్షలు తెలిపిన నాయకులు..
నాగిరెడ్డిపేట్, నవంబరర్ 23 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన కల్వకుంట్ల కవితకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి, లింగంపేట్ జడ్పీటీసీ శ్రీలత, సత్యంరావ్ తదితరులు అభినందించారు.
నిజామాబాద్‌కు తరలిన నాయకులు..
నిజాంసాగర్/పిట్లం, నవంబర్ 23: కవిత తరఫున పలు సెట్ల నామినేషన్ వేసేందుకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు నిజామాబాద్ తరలివెళ్లారు. నామినేషన్ అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, మాజీ చైర్మన్ రాజు, నిజాంసాగర్ ఎంపీపీ పట్లోల్ల జ్యోతిదుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, దుర్గారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పిట్లం మండలం నుంచి ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీలు వెంకట్‌రెడ్డి, నవీన్, నాయకుడు విజయ్ తదితరులు తరలివెళ్లారు.