లింగంపేట/ఎల్లారెడ్డి/రామారెడ్డి/బిచ్కుంద/ నిజాం సాగర్/బీర్కూర్/నస్రుల్లాబాద్/దోమకొండ/మాచారెడ్డి/బీబీపేట్, నవంబర్ 23: సాకేంతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాలపై విద్యార్థి దశనుంచే అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలల్లో మంగళవారం సైబర్ కాంగ్రెస్ సదస్సులు నిర్వహించారు. విద్యార్థులనే అంబాసిడర్లుగా ఎంపికచేసి వారి ఆధ్వర్యంలో పిల్లలకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలతీరుపై పోస్లర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆన్లైన్ గేమ్స్, బహుమతుల పేరిట మోసగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. బ్యాంకు అధికారులపేరిట కాల్చేసి అకౌంట్, ఓటీపీ తదితర వివరాలను తెలుసుకొని ఖాతాలోని డబ్బులను ఖాళీ చేస్తారని వివరించారు. ఇలాంటి మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఇతరులకు ఎలాంటి వ్యక్తిగత సమాచారం అందించొద్దని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో పోలీసు, విద్యాశాఖ అధికారులతోపాటు స్థానిక పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
లింగంపేట కేజీబీవీలో డీఈవో రాజు ఆధ్వర్యంలో స్పందన, శిరీషను సైబర్ అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. జిల్లా కో-ఆర్డినేటర్ గంగాకిషన్, ఎంఈవో రామస్వామి, ప్రిన్సిపాల్ వాసంతి, ఏఎస్ఐ ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఐ రాజశేఖర్, ఎస్సై మధుసూదన్ రెడ్డి, హెచ్ఎం నాగరాజు, సైబర్ కాంగ్రెస్ ఇన్చార్జి కైలాస్, ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. రామారెడ్డి మండలం పోసానిపేట్, రెడ్డిపేట్ గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సై భువనేశ్వర్రావు, ఏఎస్సై జగదీశ్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు.
బిచ్కుంద మండలం హస్గుల్, పుల్కల్, శాంతాపూర్ పాఠశాలల్లో ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్ జడ్పీహెచ్ఎస్లో ఎస్సై సయ్యద్ అహ్మద్, హెచ్ఎం సాయిలు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
నస్రుల్లాబాద్ మండలం నెమ్లి జడ్పీహెచ్ఎస్లో సీఐ చంద్రశేఖర్, ఏఎస్సై హబీబ్, హెచ్ఎం వెంకటరమణ ఆధ్వర్యంలో, బీర్కూర్ జడ్పీహెచ్ఎస్లో ఎస్సై రాజేశ్, హెచ్ఎం పద్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కొనసాగాయి.
దోమకొండ మండలం అంబారీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్సై సుధాకర్, సర్పంచ్ సలీం, ఎంపీటీసీ రాజేశ్వర్ ఆధ్వర్యంలో, మాచారెడ్డి జడ్పీహెచ్ఎస్లో ప్రొబేషనరీ ఎస్సై శ్రీహిత, హెచ్ఎం కరుణశ్రీ ఆధ్వర్యంలో, బీబీపేట్ మండలం మాందాపూర్ పాఠశాలలో ఏఎస్సై రాములు, మెంటర్ టీచర్ అనిల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.