ఎల్లారెడ్డి, డిసెంబర్ 21: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని పలు గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు కొనుగోలు చేయడానికి ఆయన చెక్కులను మంగళవారం అందజేశారు. మండలంలోని శివ్వాపూర్, దావల్మల్కపల్లి, రేపల్లెవాడ, లింగంపేట్ మండలంలోని మాలపాటి గ్రామాల సర్పంచులకు రూ. మూడు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కావాల్సిన నిధులను సమకూరుస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, వెల్లుట్ల సొసైటీల చైర్మన్లు ఏగుల నర్సింహులు, పటేల్ సాయిలు, అన్నాసాగర్ సర్పంచ్ పెరుగు నాగరాజు, నాయకులు ఇమ్రాన్, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 21: మండల కేంద్రంలోని క్యాం పు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంతోపాటు వెంకటాపూర్, సాతెల్లి, అన్నాసాగర్, జంగమాయిపల్లి, అల్మాజిపూర్ గ్రామాలకు చెందిన 11మందికి రూ.3.91 లక్షల చెక్కులను అందజేశారు.