తాడ్వాయి, నవంబర్ 19 : మండలపరిధిలోని బ్రహ్మాజివాడి గ్రామశివారులో సిద్ధులగుట్టపై ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్ద జాతరను శుక్రవారం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే జాతరలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సైంటిస్టు పైడి ఎల్లారెడ్డి, సీడీసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సింహులు, నాయకులు రవీందర్‌రెడ్డి, ధర్మారెడ్డి, సాయిరెడ్డి, బాల్‌చంద్రం, సర్పంచ్ జ్యోతి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
తాడ్వాయి, నవంబర్ 19 : తాడ్వాయి గ్రామశివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. లారీలు రావడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. ఎమ్మెల్యే కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. కాంటా చేసిన వడ్లను రైస్‌మిల్లులకు తరలించాలని అధికారులు, సొసైటీ చైర్మన్ కపిల్రెడ్డికి సూచించారు.
పలు కుటుంబాలకు పరామర్శ…
ఎల్లారెడ్డి, నవంబర్ 19 : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోసానిపల్లి గ్రామానికి చెందిన చాకలి లింగం తల్లి రెండు రోజుల క్రితం మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే జాజాల సరేందర్ పరామర్శించారు. తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లారెడ్డిలోని గాంధీనగర్‌లో పాముకాటుతో రేణుక మృతిచెందగా.. ఆమె తల్లిదండ్రులను పరామర్శిచారు. పరామర్శించిన వారిలో నాయకులు జలంధర్ రెడ్డి, చైర్మన్ కుడుముల సత్యం, ఇమ్రాన్, ముజ్జు, ఏగుల నర్సింహులు తదితరులు ఉన్నారు.