కాంగ్రెస్‌కు రాజీనామా చేశాం.. ఈ నెల 9నటీఆర్ఎస్లో చేరుతాం
విలేకరుల సమావేశంలో బీర్కూర్ మండల నాయకులు
బీర్కూర్, ఆగస్టు 6: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడు తున్న అభివృద్ధి పనులకు తా ము ఆకర్షితులమై కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ మండల మండల అధ్యక్షుడు పోగు నారాయణ తెలిపారు. శుక్రవారం ఆయ న మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘ భవనం ఆవరణలో విలేకరుల తో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. రైతుబంధు పథకాన్ని దేశ ప్రధాని మోదీ అనుసరించడమే దీనికి నిదర్శనమన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఐదువేల డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తిచేయగా.. మరో ఐదు వేల ఇండ్లకు మంజూరు తెచ్చారన్నారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు, అభివృద్ధిలో పాలు పంచుకుందామని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామన్నారు. ఈ నెల 9న టీఆర్ఎస్లో చేరనున్నట్లు చెప్పారు. రాజీనామా చేసిన వారిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రె నాగరాజు, వార్డు సభ్యులు ఇస్తరాకుల గంగామణి, వడ్ల బస్వరాజ్, సొసైటీ డైరెక్టర్ పోగు పాండు, పార్టీ గౌరవ అధ్యక్షుడు పోతుల వెంకటేశం, పట్టణ ఉపాధ్యక్షుడు ఎండీ హైమద్, కార్యదర్శి అబ్దుల్ ఖదీర్‌తో పాటు సుమారు 25 మంది ఉన్నారు. కార్యక్రమంలో నాచుపల్లి హన్మాండ్లు, మెక్క శివరాజ్, నల్లజెరు విఠల్, బబ్లూ, టెంట్ ఆరిఫ్, మొల్ల అజీజ్ తదితరులు పాల్గొన్నారు.