నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 19: జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటాలు, విగ్రహాలకు నివాళులర్పించారు. స్థానిక యువకులు కాషాయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ ఆవరణలో ఉన్న శివాజీ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్య క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిట్టు వేణుగోపాల్‌రావు, జిల్లా అధ్యక్షుడు నిట్టు వెంకట్రావు, కౌన్సిలర్ కృష్ణాజీరావు, ఆర్యక్షత్రియ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఆర్యక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్రానంద్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ భూషణం, ఎంపీటీసీ శాంతాబాయి, ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిజాంసాగర్, జుక్కల్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, మాచారెడ్డి మండలాల్లో శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు, టీఆర్ఎస్ యువ నాయకుడు హరీశ్షిండే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మద్నూర్‌లో శివాజీ జయంతి సందర్భంగా అన్నదానం చేశారు. వేడుకల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, టీఆర్ఎస్ యువ నాయకుడు హరీశ్షిండే, సర్పంచుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దరాస్ సురేశ్, గఫార్, ఎంపీటీసీ సాయిలు, నాయకులు కుషాల్, హన్మంత్, భానుగౌడ్, సుధీర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి మండలంలో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, సర్పంచ్ గంగారాం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ సరస్వతి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ తేలు లక్ష్మీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ సాయి, ఎస్సై రాజారాం, ఏఎస్సై రాములు, సతీశ్, జీపీ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు, శివాజీ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
దోమకొండలో శివాజీ విగ్రహానికి జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, ఎంపీపీ కానుగంటి శారద, సర్పంచ్ అంజలి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, సింగిల్‌విండో చైర్మన్ నాగరాజురెడ్డి, యువజన సంఘం ప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ, శోభాయాత్ర నిర్వహించారు.
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ దుర్గామాతా యూత్ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల్లో శివాజీ చిత్రపటంతో శోభాయాత్ర, బైక్ ర్యాలీలు నిర్వహించారు. బీర్కూర్‌లో శివాజీ చిత్రపటానికి ఎంపీపీ తిలకేశ్వరి రఘు నివాళులు అర్పించారు.
ఎల్లారెడ్డి పట్టణం, నాగిరెడ్డిపేట్, లింగంపేట, గాంధారి, పిట్లం మండలకేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు.