ఆర్మూర్‌టౌన్, ఏప్రిల్ 29: పట్టణంలో హోల్‌సేల్‌గా బంగారం విక్రయించే ఓ వ్యాపారి.. పలువురి వద్ద రూ.10 కోట్లు వసూలు చేసి పరారైన ఘటన చోటుచేసుకున్నది. పట్టణానికి చెందిన ఓ వ్యాపారి నగల దుకాణాలకు బంగారాన్ని హోల్‌సేల్ ధరకు విక్రయించేవాడు. తులం బంగారాన్ని మార్కెట్ ధర కన్నా రూ.1500 నుంచి రూ. 2 వేల వరకు తక్కువ రేటుకు అమ్మేవాడు.
ఇలా కొన్ని నెలలుగా బంగారం విక్రయిస్తున్న సదరు వ్యాపారి 15 రోజుల నుంచి కనబడకుండాపోయాడు. బంగారం కొనుగోలు చేయడానికి అతడికి కొందరు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. ఇలా మొత్తం రూ.10 కోట్లకు పైగా ఇవ్వగా, వ్యాపారి కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.