మాచారెడ్డి, సెప్టెంబర్ 20 : తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట గ్రామంలో మంగళవారం పర్యటించా రు. ఈ సందర్భంగా గ్రామంలో దాదాపు కోటి రూపాయల అభివృద్ధి పనులు రైతు వేదిక, సీసీ రోడ్డు, ఇతర పనులను ప్రారంభించారు. లచ్చాపేట, బండరామేశ్వర్‌పల్లి గ్రామాల మధ్యలో పాల్వంచ వాగు పై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మున్నూరుకాపు ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత రూ.2 వేలు ఆసరా ఫించన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. అనంతరం నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్‌చంద్రం, వైస్‌ఎంపీపీ నర్సింహారెడ్డి, సర్పంచ్ జగతి, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ వినోద్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల చైర్మన్ భూక్యా నర్సింహులు, మాచారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ పూల్చంద్నాయక్, ఆలయ కమిటీ చైర్మ న్లు కమలాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, హంజినాయక్, ముస్తాక్‌హుస్సేన్, రామ్మోహన్, రాజు, బాలాగౌడ్, రమేశ్‌గౌడ్, గోవింద్‌రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత
దోమకొండ, సెప్టెంబర్ 20: మండల కేంద్రంలోని చాముండేశ్వరీ ఆలయ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాలని ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్‌కు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానపత్రికను మంగళవారం అందజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వవిప్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ కమిటీ చైర్మన్ పాలకుర్తి శేఖర్, ధర్మకర్తలు రాజిరెడ్డి, రాజయ్య, నవీన్‌కుమార్, బాబాయ్, ప్రధాన అర్చకుడు శరత్చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.