ఖలీల్‌వాడి అక్టోబర్ 9 : తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ చరిత్ర, సంస్కృతీసంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. నగర ప్రజలు బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు.
మండలాల్లో..
డిచ్‌పలి/ధర్పల్లి/జక్రాన్‌పల్లి/నిజామాబాద్ రూరల్/ఇందల్వాయి, అక్టోబర్ 9 : డిచ్పల్లి మండలం మిట్టపల్లిలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఒడ్డెం నర్సయ్య, సర్పంచ్ గణేశ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఎంపీటీసీ బాలగంగాధర్, నాయకులు సంతోష్, శంకర్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు చీరలు పంపిణీ చేశారు.
జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి, తొర్లికొండ, కొలిప్యాక్, పడకల్, మునిపల్లి గ్రామాల్లో సర్పంచులు మాదారి లత, సురేశ్, గంగు, శ్రీనివాస్, చిన్నసాయారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఎంపీటీసీలు రాజు, పద్మ, గంగారెడ్డి, తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు, రేషన్‌షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగర శివారులోని 13వ డివిజన్ పరిధిలో ఉన్న సారంగాపూర్‌లో స్థానిక కార్పొరేటర్ ఆరోన్ ఖాన్ చీరలు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ హన్మంత్, టీఆర్ఎస్ నాయకులు హరిచంద్, సుదర్శన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలం డొంకల్, అన్సాన్పల్లి, జీకేతండా తదితర గ్రామాల్లో ఎంపీపీ రమేశ్‌నాయక్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. వైస్‌ఎంపీపీ భూసాని అంజయ్య, సర్పంచ్ గంగవ్వ, మోహన్‌నాయక్, విఠల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.