లింగంపేట్ : లింగంపేట్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర నారగోడ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచారు.
మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సుప్పలరాజు, లింగంపేట్ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లమయ్య, కాసిం రవిరామా గౌడ్, పాషా తదితరులు పాల్గొన్నారు.