Peddakodapgal | పెద్దకొడప్ గల్, ఆగస్టు 18 : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ఆడబిడ్డల వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.
ఈ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్థిక సహాయం అందించి పేద కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఉపయోగపడుతున్న ఈ పథకాలను కొనసాగించాలని, పెండింగ్ లో ఉన్న చెల్లించాలని,తులం బంగారం కూడా వెంటనే అందించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆకుల సతీష్ యాదవ్, పెండ్యాల సుధీర్ కుమార్, మహమ్మద్, మాజీ సర్పంచ్ బాన్సీలాల్,కార్యకర్తలు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.