లింగంపేట/రామారెడి ్డ(గాంధారి), ఏప్రిల్ 16: వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపునిచ్చారు. బుధవారం తాడ్వాయి, గాంధారి మండల కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్..పదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు.
అన్ని వర్గాల సంక్షే మం కోసం కృషిచేశారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే తన బలమని, ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని జాజాల భరోసా ఇచ్చారు. వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సన సభకు తరలివెళ్లడానికి ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. గాంధారిలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి చలో వరంగల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వాల్పెయింటింగ్ను ప్రారంభించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ముదాం నర్సింహులు, నాయకులు నారాయణ, రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి, రాజాగౌడ్, రమేశ్, మల్లారెడ్డి, మంగారెడ్డి, సాయిరెడ్డి, తాజుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.