Bheemgal | ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఊర పండుగ ఆహ్వానం
భీమ్‌గల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఊర పండుగకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కమిటీ ప్రతినిధులు బుధవారం వేల్పూర్‌లోని ఆయన స్వగృహంలో కలిసి ఆహ్వానించారు.
భీమ్‌గల్, జూలై 1: నిజామాబాబద్ జిల్లా భీమ్‌గల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఊర పండుగకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కమిటీ ప్రతినిధులు బుధవారం వేల్పూర్‌లోని ఆయన స్వగృహంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఊర పండుగ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేశారు.
అనంతరం కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ, ఉపాధ్యక్షుడు తీగల రఘు మీడియాతో మాట్లాడుతూ.. జూలై 12న నిర్వహించనున్న ఊర పండుగకు ఎమ్మెల్యే హాజరై గ్రామదేవతల ఆశీస్సులు పొందాలని కోరినట్లు తెలిపారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ, ఉపాధ్యక్షుడు తీగల రఘు, ప్రధాన కార్యదర్శి నిచ్చెమోల్ల రాజేశ్వర్, కోశాధికారి ఎస్.పీ. భూమేశ్వర్, సలహా కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు నీలం రవి, మల్లెల ప్రసాద్, బొదిరె నర్సయ్య, గున్నాల బాలభాగత్, మాజీ కౌన్సిలర్ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

