BJYM | కంఠేశ్వర్ జూన్ 21 : ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల దందా, స్కాలర్షిప్ విడుదలలో నిర్లక్ష్యం వంటి సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని వాపోయారు.
ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ,ప్రైవేట్ విద్యా సంస్థలు డొనేషన్ పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నందున వాటిపై చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా కొన్ని విద్య సంస్థలు తోక పేర్లు తగిలించి నడుస్తున్నాయని, DEO అటువంటి పాఠశాలను గుర్తించి చర్యలు తీసుకొని యెడల పెద్ద ఎత్తున బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చెపడుతమాని హెచ్చరించారు. ఈ సందర్భంగా DEO కు రాష్ట్ర ప్రభుత్వం వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం విద్యాశాఖ ఏడికి వినతి పత్రం ఇచ్చారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్, యాదాల నరేష్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమంద్ మండల అధ్యక్షులు సాయి కుమార్, సురేష్, ప్రశాంత్, విఫుల్ రావు, మండలాల నాయకులు,జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.