మౌలిక సదుపాయాలు కల్పించాలి
వచ్చే జూన్ 10లోపు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి మౌలిక సదుపాయలు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు.
- కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
ఎల్లారెడ్డి రూరల్/ గాంధారి/బాన్సువాడ, ఏప్రిల్ 18: వచ్చే జూన్ 10లోపు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి మౌలిక సదుపాయలు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పథకంలో భాగంగా ఎల్లారెడ్డి పట్టణంలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాథమిక, ఎంపీపీఎస్ బాలికల పాఠశాల, జడ్పీహెచ్ఎస్, గాంధారి మండలంలోని పొతంగల్ కలాన్ పాఠశాలతోపాటు బాన్సువాడలోని పోలీస్ లైన్ ప్రాథమికోన్నత, పాత బాన్సువాడలో ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు.
పాఠశాలల్లో తాగునీటి వసతి, టాయిలెట్స్, విద్యుత్ సౌకర్యం, చేపట్టాల్సిన మరమ్మతు పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో కలిసి పరిశీలించి సూచనలు, సలహాలు అందజేశారు. పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సంబంధిత శాఖ ఏఈలకు ఆయన సూచించారు. ఎంఈవోలు వెంకటేశం, సేవ్లానాయక్, నాగేశ్వర్రావు, ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు, ఈఈ మల్లేశం, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

