మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 70,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఏఈఈ మాదవి తెలిపారు. ప్రాజెక్ట్ 13 వరద గేట్ల నుంచి 74,880 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మి కాలువకు 80, అలీసార్ ఎత్తిపోతల పథకానికి 180 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందని వివరించారు.
ఈ సీజనులో ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 609.882 టీఎంసీల వరద నీరు వచ్చిందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీల) సామర్థ్యం కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.90 అడుగులు (89.763 టీఎంసీల) నీటినిల్వ ఉందని ఆమె వివరించారు.