Kamareddy | కామారెడ్డి : కామారెడ్డిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. వైద్యులు సకాలంలో డెలివరీ చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బంధువుల కథనం ప్రకారం.. స్వరూప అనే బాలింత డెలివరీ కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు.
నోప్పులు అధికం కావడంతో ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు కోరినా వైద్యులు నిరాకరించలేదు. నార్మల్ డెలివరీ కోసం ఎదురు చూసి, శనివారం ఆపరేషన్ చేయగా చనిపోయిన మగ శిశువును అప్పగించాం. కాగా ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యులను సముదాయించారు.