ఖలీల్వాడి, ఆగస్టు 10: ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీగెట్-2024లో ఇందూరు విద్యార్థిని ప్రతిభ చాటింది. ఎమ్మెస్సీ డాటాసైన్స్ విభాగంలో ప్రవేశానికి జరిగిన ప్రవేశపరీక్షలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంకును నగరానికి చెందిన మంచిర్యాల నిహారిక సాధించింది.
నగరంలోని జెండాగల్లీకి చెందిన మంచిర్యాల బ్రహ్మం-వనజ దంపతుల కుమార్తె నిహారిక.. కాగా తండ్రి బ్రహ్మం బతుకుదెరువు కోసం దుబాయికి వలస వెళ్లాడు.