కంఠేశ్వర్, డిసెంబర్ 11 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఫ్లెక్సీలో ‘పర్యాటక రంగంపై రెడ్ టేపిజం’ అని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ‘నిజామాబాద్ జిల్లాలో కొంతమంది అధికారుల కబంధ హస్తాలలో చిక్కిన పర్యాటక రంగం’..‘ త్వరలో అన్ని ఆధారాలతో మీ ముందుకు’ అని పేర్కొనడం ఎవరిని ఉద్దేశించినవని నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారో తెలియకపోవడంతో అధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.