వినాయక్‌నగర్, జూన్ 4: మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమగా సిగరెట్లు తరలిస్తుండగా నిజామాబాద్ నగరంలో పోలీసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పరిధిలో ఎస్సై హరిబాబు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటువైపు వచ్చిన ఓ ఆటోను తనిఖీ చేయగా అందులో సుమారు 20 కాటన్లలో సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు.
ఎలాంటి అనుమతి లేకుండా (జీఎస్టీ చెల్లించకుండా) మహారాష్ట్ర నుంచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఆటోలో ఉన్న వ్యక్తిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయ్‌గావ్‌కు చెందిన విఠల్‌గా గుర్తించారు. పట్టుబడిన సిగరెట్ల విలువ సుమారు రూ.20లక్షల వరకు ఉంటుందని ఎస్సై హరిబాబు తెలిపారు. ఆటోను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తదుపరి దర్యాప్తు కోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు లేఖ రాసినట్లు ఎస్సై వివరించారు.