బాన్సువాడ, జూలై 16: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండిస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజును విమర్శిస్తే ఊరుకునేది లేదని వారి అనుచరులు హెచ్చరించారు. బాన్సువాడలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. 15 ఏండ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న కాసుల బాల్‌రాజ్‌కు కాకుండా అధిష్టానం ఏనుగు రవీందర్‌రెడ్డికి టికెట్ ఇస్తే తామంతా కష్టపడి పని చేశామన్నారు. కానీ బాల్‌రాజ్‌కు పదవి వ స్తుంటే అడ్డుకోవాలని చూసింది మీరు కాదా? అని ఏనుగు అనుచరులను ప్రశ్నించారు.
రవీందర్‌రెడ్డి ఇప్పటిదాకా పోచారం, కాసులకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, మీరెందుకు మాట్లాడుతున్నారన్నారు. నేతలకు వ్యతిరేకంగా మాట్లాడున్న వారికి పార్టీ కార్యకర్తలే తరిమి కొడతారని యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు దేవికృష్ణ ప్రసాద్, రత్నాకర్ హెచ్చరించారు.