బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 24: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు 73 కుటుంబాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. సర్పంచ్ నారాయణ రెడ్డి, గ్రామపెద్దల సమక్షంలో తీర్మాన కాపీని బాన్సువాడ పట్టణంలో స్పీకర్‌కు ఆయన స్వగృహంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిములు మాట్లాడుతూ.. తమ గ్రామంలో మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్పీకర్ పోచారం రూ.12 లక్షలు కేటాయించారని, ఇండ్లు లేనివారి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. తాము పోచారం కుటుంబానికి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సాయిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సాయిరెడ్డి, మతపెద్దలు పాల్గొన్నారు.
బాన్సువాడ పట్టణంలోని కేసీఆర్ నగర్, పీఎస్ఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ ప్రజలు ఆదివారం రాత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయా కాలనీలకు చెందిన సుమారు 4 వేల మంది.. స్పీకర్ పోచారం వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.