Hanmanth Shinde | పెద్ద కొడప్గల్, జూలై 3 : బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని పలు బాధిత కుటుంబాలను ఆయన శుక్రవారం పరామర్శించారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని బేగంపూర్ తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దన్ను తల్లికి ఇటీవల ఆటో బోల్తా పడిన ప్రమాదంలో కాలు విరగడంతో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న హన్మంత్ షిండే వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే అదే తండాకు చెందిన బలరాం తల్లి గుండెపోటుతో కొద్ది రోజుల క్రితం మృతి చెందగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు విజయ్ దేశాయ్, పార్టీ నాయకులు సతీష్ యాదవ్, సంగప్ప దేశాయ్, పెండ్యాల సుధీర్ కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.