బాన్సువాడ రూరల్ : కామారెడ్డి ( Kamareddy ) జిల్లా బాన్సువాడ మండలం హన్మాజిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఛత్రునాయక్ తండాలో గుగులోత్ మాణిక్ రావుకు చెందిన గుడిసె (Hut burnt ) బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గుడిసెలో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రూ. 90 వేల నగదు, రెండు తులాల బంగారు నగలతో పాటు పట్టా పాసు బుక్కులు, వంట పాత్రలు, దుస్తులు పూర్తిగా కాలిపోయాయని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.