భిక్కనూరు/ఖలీల్‌వాడి, ఆగస్టు: బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి 44వ నంబర్ జాతీయరహదారిపై ఏర్పడిన ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్లో స్థానికల సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జీవన్‌రెడ్డి హాజరుకావడానికి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. మార్గమధ్యంలో కామారెడ్డి జిల్లా సరిహద్దులో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో నిజామాబాద్‌కు రాలేని పరిస్థితి ఎదురు కావడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
కేందంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీల తీరు దొందూ దొందేనని జీవన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు నీకేం కావాలో నాకు చెప్పు, నాకేం కావాలో నీకు చెబుతా అన్నట్లు ఉన్నదని పేర్కొన్నారు. ఒక వైపు ఓట్ల దొంగలు.. మరోవైపు దోపిడీ దొంగలు ప్రజలకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. కలెక్టర్, డీపీవోతో ఆయన ఫోన్లో మాట్లాడి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని తెలిపారు. ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలను తెలిపారు.ఓటర్ల జాబితాల్లో ఏమైనా మార్పులు ఉంటే పార్టీ గ్రామ, మండల, పట్టణ అధ్యక్షులను సంప్రదించాలని సూచించారు.