పోతంగల్ మే 06 : బదిలీపై వెళుతున్న బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కు ఖాతాదారులు సన్మానించారు. నిజమాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేర్గా విధులు నిర్వహిస్తున్న ఉమేష్ ఎడపల్లికి బదిలీ అయ్యారు. ఈ సంధర్బంగా అయనకు మంగళవారం ఖాతాదారులు ఘనంగా సన్మానించారు. మూడు సంవత్సరాలుగా బ్యాంకులో అందరితో మమేకమై విశేష సేవలందించారని కొనియాడారు.
ఆయన విధి నిర్వహణలో సమర్థంగా పనిచేసి ఖాతాదారుల మన్ననలు పొందారని, ఆయన భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, క్యాషియర్ నరేష్, స్థానికుల లింగప్ప, రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సొండే లింగప్ప, శ్రీనివాస్ రెడ్డి, బస్వంత్ పటేల్, మక్కయ్య, ఈశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాగయ్య, శ్రావణ్, కిరణ్, హన్మండ్లు తదితరులున్నారు.