Crop rotation | కోటగిరి : పంట మార్పిడీ పాటించడం ద్వారా నేల సారాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని దింతో అధిక దిగుబడులు సాధించవచ్చఅని ప్రాంతీయ వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త ఆర్ జయ ప్రకాష్ అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలన్నారు. పంటకు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని సూచించారు. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. పంటలకు పురుగు మందులు సైతం అవసరం మేరకే వాడాలన్నారు. విత్తనాలు ఎరువులు పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు దుకాణంలో ఖచ్చితంగా రసీదు తీసుకోవాలన్నారు.
పంట మార్పిడీలో భాగంగా రైతులు పప్పు దినుసులు, నూనె గింజల పంట సాగుపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల వ్యవసాయ అధికారి రాజు, కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఏఈవోలు ఆస్మా బేగం,గౌస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.