ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన డైరెక్టర్ హన్మంత్‌రావు అన్నారు. రైతులకు దీర్ఘకాలం లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచిం చారు. మంగళవారం ఆయన జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి పర్యటించారు
- ఆ దిశగా రైతులు దృష్టి సారించాలి
- రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,
- ఉద్యానవన డైరెక్టర్ హన్మంత్‌రావు
బాన్సువాడ రూరల్/ నస్రుల్లాబాద్/ నాగిరెడ్డిపేట, జనవరి 10: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన డైరెక్టర్ హన్మంత్‌రావు అన్నారు. రైతులకు దీర్ఘకాలం లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచిం చారు. మంగళవారం ఆయన జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి పర్యటించారు. బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ పంటలను పరిశీలించారు. పంటల సాగులో మెళకువలను రైతులకు వివరించారు. ఒకే రకమైన పంటలు వేయకుండా దీర్ఘకాలం లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్‌పామ్ పంటను సాగుచేయాలని సూచించారు.
ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 2లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంటలను సాగుచేస్తున్నారని చెప్పారు. నాలుగేం డ్లలో పది లక్షల ఎకరాలకు విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమ న్నారు. పంట విస్తీర్ణం పెరిగితే భవిష్యత్తులో చాలా మంది కూలీలకు రాష్ట్రంలోనే ఉపాధి లభిస్తుందన్నారు. అనంతరం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. మొక్కల సంఖ్యను పెంచాలని నిర్వాహకులకు సూచించారు. బొప్పాస్ పల్లి గ్రామంలోని రాష్ట్ర విత్తనోత్పత్తి క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సాగవుతున్న ఆయిల్‌పామ్ పంటతోపాటు మైలారంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గ్రామంలో చెత్త సేకరణ గురించి కంపోస్ట్ ఎరువు తయారీపై ఆరా తీశారు. దుర్కి గ్రామంలో క్రీడాప్రాంగణాన్ని పరిశీలించారు.
విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఆయిల్‌పామ్ క్షేత్రంగా మారుస్తాం..
నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద విత్తనోత్పత్తి, పండ్ల మొక్కల ఉత్పత్తి క్షేత్రాలను హన్మంత్‌రావు సందర్శించారు. అక్కడ ఆయిల్‌పామ్ పంట సాగుచేయడానికి సంబంధించిన భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ పంట సాగుకు 365 రోజుల పాటు నీటి వసతి ఉండాలన్నారు. పోచారం ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు. విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఆయిల్‌పామ్ క్షేత్రంగా మార్చేందుకు భూమిని పరిశీలించినట్లు తెలిపారు. విత్తనోత్పత్తి క్షేత్రంలో మొత్తం 701 ఎకరాల భూమి ఉన్నదని హార్టికల్చర్ అధికారి రామకృష్ణ కమిషనర్‌కు వివరించారు.
అనంతరం ఆయన మాల్తుమ్మెద గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి, ఆవరణలో మొక్కను నాటా రు. వారి వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రె, ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీపీ రాజ్‌దాస్, ఎంపీడీవో రఘు, ఎంపీ వో శ్రీనివాస్, తహసీల్దార్ సయీద్ అహ్మద్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్డీవో రాజాగౌడ్, డీఎల్పీవో శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, సాయిరెడ్డి, భగవాన్‌రెడ్డి, బలరాం, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో సాయన్న, ఎంపీపీ పాల్త్య విఠల్, జడ్పీ కో -ఆప్షన్ సభ్యుడు మాజిద్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, సర్పంచులు అరిగె సాయిలు, హన్సీబాయి, శ్యామల, ఎంపీటీసీ నారాయణ, ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ సింగ్, సాయిలు యాదవ్, మోహన్, మహేశ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

