ఉమ్మడి జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కాగా..మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి పట్టణంలోని పలు రోడ్లు చెరువులను తలపించాయి.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. రాజంపేట మండల కేంద్రంలో వర్షానికి రోడ్డుకు అడ్డంగా ఓ వేప చెట్టు విరిగి పడగా.. పోలీసులు స్థానిక యువకుల సాయంతో తొలగించారు.
– కామారెడ్డి/ఖలీల్వాడి/ రాజంపేట, ఆగస్టు 16