కామారెడ్డి : జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం ( Heavy Rains ) కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, సదాశివనగర్, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూర్ మండలాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది. పలు చోట్ల కల్లాల్లో వరి ధాన్యం తడిసిముద్దయ్యింది.

కామారెడ్డి ( Kamareddy) ప్రధాన బస్టాండ్ వద్ద భారీ వృక్షం నేల కొరిగింది. దీంతో బస్టాండ్ లోపలికి బస్సులు వెళ్లేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అకాల వర్షంతో ధాన్యం తడవుడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.