Heavy rain | నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి జల్లులతో కూడిన వర్షం ఏకధాటిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ అనేక చోట్ల జల్లులతో కూడిన వర్షమే పడుతోంది.
నిజామాబాద్, కామారెడ్డి పట్టణంలో కురుస్తున్న వానకు లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే నాట్లు వేసిన రైతులు ఊపరిపీల్చుకుంటున్నారు. అలాగే మిగిలిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు.