ఆర్మూర్ : పట్టణంలోని 30 పడకల దవాఖానను వంద పడకల దవాఖానగా అభివృద్ధి చెందడంతో వైద్యం మరింత అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని అన్ని వార్డులలో పర్యటించి దవాఖాన సూపరింటెండెంట్ నాగరాజు, డిప్యూటీ డీయంఅండ్ హెచ్‌వో రమేశ్‌తో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కావటంతో రోగులకు అత్యవసర పరిస్థితిలో సేవలందుతున్నాయని వివరించారు. బాలింతలు రోగుల వద్దకు వెళ్లి సౌకర్యాలపై అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం మాజీ సర్పంచ్ కొంగి సదాశివ్ ఇంటికి వెళ్లి అనారోగ్య సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితాపవన్ , వైస్ చైర్మన్ షేక్ మున్నా, జడ్పీటీసీ మెట్టు సంతోష్ , తాసీల్దార్ వేణుగోపాల్ గౌడ్ , కౌన్సిలర్లు, సర్పంచ్‌లు తదితరులు ఉన్నారు.