Hanuman Jayanti | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అన్ని హనుమాన్ మందిరం లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మందిరం వద్ద అన్నదానం నిర్వహించారు. కోటగిరి వీర హనుమాన్, మీది గల్లీ హనుమాన్ మందిరం తో పాటు ఆయా మందిరాల వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు. మాజీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.