కామారెడ్డి, మార్చి 14: వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.