4న గురుకుల ప్రతిభా కళాశాల ప్రవేశపరీక్ష
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతి భా కళాశాలల్లో (2024-25) ప్రవేశాలకు ఈ నెల 4న పరీక్ష (సీవోఈ సెట్) నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారిణి అలివేలు తెలిపారు.
డిచ్పల్లి, జనవరి 31 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతి భా కళాశాలల్లో (2024-25) ప్రవేశాలకు ఈ నెల 4న పరీక్ష (సీవోఈ సెట్) నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారిణి అలివేలు తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో టీఎస్డబ్ల్యూఆర్ఎస్/జేసీ, ధర్మారం(బి), కంజర, ఆర్మూర్(బి), సుద్దపల్లి, పోచంపాడ్, నవీపేట్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, భిక్కనూర్, దోమకొండ, తాడ్వాయి, తడ్కోల్, కొయ్యగుట్ట, తక్కడపల్లి, పెద్దకొడప్గల్, కామారెడ్డి డిగ్రీ కళాశాల, పెద్ద ఎక్లారా, బాన్సువాడ బోర్లం, నిర్మల్ జిల్లాలోని ముథోల్, లెప్ట్ పోచంపాడ్, జామ్, కడెం, బైంసాలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, www. tswreis. ac. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా సమయానికి గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించి నిర్ధారించుకోవాలని, గుర్తించడంలో ఏవైనా ఇబ్బందులుంటే హాల్ టికెట్లో ముద్రించిన ముఖ్య పర్యవేక్షకుడి నెంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

