Water Problem | సిరికొండ, ఏప్రిల్ 26 : వేసవికాలంలో పల్లెల్లో అడుగంటుతున్న భూగర్భ జలా లు తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. దీంతో తాగునీరు అందక పల్లె ప్రజలు అల్లాడిపోతున్నారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డెర కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గత వారం రోజులుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మిషన్ భగీరథ సరిపడనీరు రావడంలేదని ఆరోపించారు. కాలనీలో ఉన్న రెండు బోరు బావుల్లో నీటి శాతం తగ్గిపోవడంతో వట్టిపోయాయి. తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్న విషయాన్ని స్థానిక సర్పంచ్ బాకారం వరలక్ష్మి సంతోషం దృష్టికి తీసుకెళ్లారు. ట్యాంకర్ ద్వారా నీరు అందించినట్టు కాలనీవాసులు పేర్కొన్నారు. ప్రతీ ఏడాది తాగునీటి ఇబ్బంది ఏర్పడుతుందని అధికారులు చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.