జూలై 27 : విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కంకర లారీ బోల్తా కొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్ నుండి కంకర లోడ్‌తో లారీ కోటగిరి వైపు వెళ్తున్న క్రమంలో మండల కేంద్రంలోని ములమలుపు వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది.
డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. దీంతో రెండూ కరెంటు స్తంభాలు విరిగి పోయి మండల కేంద్రంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.