నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 2 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైష్ణవ ఆలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. ఉపవాసదీక్షలతో భక్తులు పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారు జాము నుంచే ఆలయాలకు బారులు తీరారు. అర కిలోమీటర్ మేర భక్తలు ఉదయం నుంచి క్యూలో నిల్చున్నారు. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలోని ఉన్న వేంకటేశ్వరస్వామి, గోపాల్ స్వామి రోడ్లో ఉన్న వేణుగోపాల్‌స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకున్నారు. విద్యానగర్‌లోని సాయిబాబా, హౌసింగ్ బోర్డు కాలనీలో శారదాదేవి, సంకష్ఠ హర గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి పంచముఖి ఆలయాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండలోని లక్ష్మీనారాయణస్వామి, చాముండేశ్వరీ, సంగమేశ్వర్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాముండేశ్వరీ ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వైకుంఠద్వారం నుంచి ఊరేగింపు చేపట్టారు. లక్ష్మీనారాయణస్వామి, కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయల్లో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకాలు, అర్చనలు కొనసాగాయి. భక్తులకు ఉత్తరద్వారం నుంచి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, ఎంపీపీ శారద, సర్పంచ్ అంజలి, శ్రీనివాస్, సీడీసీ చైర్మన్ ఐరేని నర్సయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్లు పాలకుర్తి శేఖర్, లింగ రాజేందర్, లోయపల్లి శ్రీనివాస్‌రావు, ఈవో ప్రభు, ధర్మకర్తలు ముక్కనారాయణ, కదిరె పద్మాదుర్గారెడ్డి, అబ్రబోయిన సిద్ధిరాములు, ఉగ్రవాయి రాజయ్య, స్వాములు నర్సారెడ్డి, అబ్బయ్య, మనోజ్, నాయిని బాల్‌రెడ్డి, చంద్రశేఖర్, విజయ్‌కుమార్, రాంరెడ్డి, నర్సింగ్‌రావు, యాదగిరి రావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనృసింహాస్వామి ఆలయంతోపాటు గజ్యానాయక్‌తండా, ఎక్స్‌రోడ్ గ్రామంలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ప్రభు తెలిపారు. బీబీపేట్తోపాటు మాందాపూర్, జనగామ, యాడారం, తుజాల్పూర్, మాల్కాపూర్ తదితర గ్రామాల్లోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
వైకుంఠ ఏకాదశి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గోపాలస్వామి ఆలయం, కోదండ రామాలయం, అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారి దర్శనాన్ని ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్‌పేట్‌లో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పల్లకీ సేవ చేపట్టారు. రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దండబోయిన సిద్ధిరాములు, నామాల యాదగిరి, పిట్టల గంగయ్య, అమ్ముల పశుపతి తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, సాయిబాబా ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పూజారులు వెంకటరంగ చారి, సుధాకర్ శర్మ, భక్తులు పాల్గొన్నారు. పిట్లం మండల కేంద్రంలోని వేంకటేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు ఉత్తరద్వారం ద్వారా స్వామి వారి దర్శనం కల్పించారు. రాంపూర్‌లో గుట్టపై వెలిసిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మారుతిరెడ్డి, సభ్యులు బాలాజీ రమేశ్, ఎన్నావర్ రమేశ్, కృష్ణ, వాసు, మండలి విమలమ్మ తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలం శబరిమాత ఆశ్రమంలో ఉన్న వేంకటేశ్వర ఆలయంలో, రామాలయం, కృష్ణాజీవాడిలోని రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నిజాంసాగర్లోని చంద్రమౌళీశ్వర ఆలయంలో, అచ్చంపేట గణపతి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు సంజీవ్‌రావు, శంభురావు తదితరులు పాల్గొన్నారు.