రామారెడ్డి, నవంబర్ 23 : ఇసన్నపల్లి – రామారెడ్డిలో కొలువైన కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అష్టమి తిథి సందర్భంగా స్వామి వారి జన్మదినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
పూజారులు రాచర్ల శ్రీనివాస్, మనీశ్ శర్మ, వంశీ శర్మ, ఈవో ప్రభు రామచంద్రం సమక్షంలో ధ్వజారోహణం, సింధూర మహాపూజ, భద్రకాళీపూజా కార్యక్రమాలు కొనసాగాయి. భైరవుడి బంగారు విగ్రహాన్ని ఎదుర్కొని వచ్చి ఊయల సేవ నిర్వహించారు. ఇసన్నపల్లి గ్రామస్తులు ఎడ్లబండ్లను డప్పువాయిద్యాల మధ్య స్వామి వారి ఆలయం చుట్టూ తిప్పారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. రామారెడ్డి ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.