పెద్ద కొడప్గల్,(పిట్లం) ఫిబ్రవరి 18: గ్రామపంచాయతీ పెండింగ్ బిల్లులను( Pending bills) విడుదల చేయాలని కోరుతూ ఎంపీడీవో కమలాకర్‌కు పంచాయతీ కార్యదర్శులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో గత సంవత్సరం ఫిబ్రవరి 24 పంచాయితీ పాలకవర్గం కాలపరిమితి ముగిసిన తర్వాత బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
పంచాయతీలలో రోజువారి నిర్వహణలో భాగంగా పారిశుద్ధ్యం, మరమ్మతు పనులకు ఆగస్టు వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాబోవు వేసవికాలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలంటే తక్షణమే బిల్లులు విడుదల చేయాలన్నారు. ఈ నెలాఖరు వరకు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు ఎంపీడీవోను కోరారు.