మాక్లూర్ : నిజామాబాదు జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలోని అపురూప వెంకటేశ్వరస్వామి(Venkateshwara Temple) ఆలయాన్ని త్రిపుర గవర్నర్ (Tripura Governor) నల్లు ఇంద్ర సేనా రెడ్డి (Nallu Indrasen reddy) సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అమృత లతారెడ్డి ,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.