డిచ్పల్లి : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా నియమితులైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ను హైదరాబాద్ బస్ భవన్లో శుక్రవారం ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు సంస్థకు, ప్రభుత్వానికి పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఉమ్మడి జిల్లాకు ఉన్నత పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.