నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో గదుల కొరత వేధిస్తున్నది. ఒకే భవనంలో ఒకటి నుంచి పది వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 442 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సరిపడా తరగతి గదులు లేకపోవడంతో వరండాలోనే విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ కథనం ప్రచురించగా.. స్పందించిన ప్రభుత్వం మూడు గదులతోపాటు కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీని మంజూరుచేసింది.
కానీ ఇప్పటివరకు వాటి నిర్మాణ పనులు చేపట్టకపోవడం గమనార్హం. సరిపడా గదులు లేకపోవడంతో పాఠశాలకు సరఫరా చేసిన 12 కంప్యూటర్లను కూడా ఓ మూలన పడేశారు. మైదానం కూడా లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల వరండాలో, తరగతి గదుల్లోనే ప్రార్థన చేయాల్సి వస్తున్నది.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్